ఇసుక కొరత: గుంటూరు కలెక్టరేట్ ముందు నారా లోకేష్ దీక్ష

By narsimha lode  |  First Published Oct 30, 2019, 11:23 AM IST

ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక్క రోజు దీక్షకు దిగారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు ేకుండా ఆత్మహథ్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.


గుంటూరు:  ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు దీక్షకు దిగారు.సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్ ఈ దీక్షలో పాల్గొంటారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో  ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి లోకేష్ దీక్షను ప్రారంభించారు.ఈ దీక్షలో లోకేష్ తో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్నవారికి ఇసుక  నింపిన ప్యాకెట్లతో తయారు చేసిన దండలను వేశారు. 

Latest Videos

undefined

ఇసుక కొరత కారణంగా ఏపీ  రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు పని లేక ఆందోళనకు దిగుతున్నారు. ఇసుక కొరత వల్లే తమకు పనులు లేకుండా పోయాయని భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగానే ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని టీడీపీ విమర్శిస్తోంది. భవన నిర్మాణ కార్మికుల అండగా ఏపీ రాష్ట్రంలో భవని నిర్మాణ కార్మికుల అండగా ఉంటామని జనసేన కూడ ప్రకటించింది.ఈ నెల 3వ తేదీన విశాఖ జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.

ఇప్పటికే ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపింది తెలుగుదేశం పార్టీ. పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఇసుకదొరక్క ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం మెుండివైఖరితో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఇక నేరుగా ఆయన ఇవాళ గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు. 

ఈ దీక్ష కోసం  పోలీసుల అనుమతి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు లోకేష్ దీక్షలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేతలంతా ఈ దీక్ష కార్యక్రమంలో పాట్గొన్నారు. 

also read 

click me!