పొత్తులపై పవన్‌తో చర్చించాం.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ కీలక వ్యాఖ్యలు..

Published : Feb 27, 2023, 11:59 AM IST
పొత్తులపై పవన్‌తో చర్చించాం.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జనసేన మద్దతు ఉందని చెప్పారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జనసేన మద్దతు ఉందని చెప్పారు. ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చించినట్టుగా చెప్పారు. జనసేన, బీజేపీ మాత్రమే పొత్తు ఉంటుందని ఆయన చెప్పారని తెలిపారు. 

ఇక, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవర్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన మాధవ్.. విస్తృత ప్రచారం నిర్వాహిస్తున్నారు. పలు కాలేజ్‌ల్లో తిరుగుతూ.. త్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. 

మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవి, వైసీపీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు పలువురు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఎవరూ విజయం సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇక, మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet