సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదు.. లోకేష్

Published : Dec 09, 2020, 11:53 AM ISTUpdated : Dec 09, 2020, 12:01 PM IST
సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదు.. లోకేష్

సారాంశం

జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ ఆరోపణలు  చేశారు. 

జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు.  చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని మండిపడ్డారు. 

మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతన్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైందని చెప్పారు.  ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ద మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలంటూ హితవు పలికారు.

ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu