జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా.. జగన్ పై మండిపడ్డ లోకేష్

Published : Aug 19, 2020, 09:41 AM IST
జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా.. జగన్ పై మండిపడ్డ లోకేష్

సారాంశం

కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు.ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి  దిగజారిపోయారు అంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి కరోనా వైరస్ సోకడంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సీఎం జగన్.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

జగన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమేనన్నారు. ఒక పక్క కరోనా,మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు.

కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు.ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి  దిగజారిపోయారు అంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారని మండిపడ్డారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు.

జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణమన్నారు.కడప జైలు లో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు.తక్షణమే ఆసుపత్రికి తరలించి,జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu