కడప జైలులో ఉన్న టీడీపి నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు జైలులోని ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు.
కడప: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయించారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు ఫలితాల్లో తేలింది.
జైలులోని ప్రత్యేక గదిలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తన్నారు. దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆదివారంనాడు ఆయనకు పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆయనను కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.
undefined
వాహనాల అక్రమ కొనుగోలు వ్యవహారంలో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో తన అనుచరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి సందడి చేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దళిత పోలీసు అధికారని ఆయన దూషించారు.
దాంతో తిరిగి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నన్ను మరోసారి జైలుకు పంపుతావా అంటూ పోలీసు అధికారిని జెసీ ప్రభాకర్ రెడ్డి దూషించారు.