చిల్లిగవ్వ లేక రాష్ట్రం అల్లాడుతుంటే.. పుట్టినరోజు నాడు మీడియాలో ప్రకటనలా : జగన్‌పై యనమల ఫైర్

Siva Kodati |  
Published : Dec 21, 2022, 02:58 PM IST
చిల్లిగవ్వ లేక రాష్ట్రం అల్లాడుతుంటే.. పుట్టినరోజు నాడు మీడియాలో ప్రకటనలా : జగన్‌పై యనమల ఫైర్

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. ప్రభుత్వం తరపున జారీ చేయాల్సిన ప్రకటనలను తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి జగన్ వినియోగిస్తున్నారని యనమల ఆరోపించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్ నమ్ముతున్నారని సెటైర్లు వేశారు. అందుకే తన పుట్టినరోజు నాడు మీడియా సంస్థలకు భారీగా ప్రకటనలు ఇచ్చారని యనమల దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి సుప్రీంకోర్ట్ ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వ నిబంధను ఉల్లంఘించారని రామకృష్ణుడు ఆరోపించారు. 

ప్రభుత్వం తరపున జారీ చేయాల్సిన ప్రకటనలను తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి జగన్ వినియోగిస్తున్నారని యనమల దుయ్యబట్టారు. గుంతలమయంగా మారిన రహదారులను బాగు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవంటున్నారని.. కానీ సీఎం జన్మదినం నాడు శుభాకాంక్షల ప్రకటన కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని రామకృష్ణుడు ఆరోపించారు. 

ALso Read: ఐదు, పదో తరగతి చదివినోళ్లను పట్టభద్రులుగా.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమాలు : యనమల

జీతాలు కూడా ఇవ్వలేని.. రైతుల నుంచి ధాన్యాన్ని కొనలేని పరిస్థితుల్లో వున్నా జేబులు నింపుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల పేరిట సాగుతున్న ఈ దోపిడీని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన వేళ ప్రతి రూపాయినీ జాగ్రత్తగా వినియోగించాలని యనమల కోరారు. 
 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే