మహిళలు రోకళ్ళు, కత్తులు దగ్గరుంచుకోవాలి

First Published Jun 16, 2017, 8:34 AM IST
Highlights

అత్యాచారాలు జరిగిన తర్వాత మొత్తుకునేకన్నా ముందే జాగ్రత్త పడటం మంచిదని అనుకున్నట్లున్నారు. అందుకనే మహిళలందరూ రోకలి బండలు, కత్తులు దగ్గర పెట్టుకోవాలని  చెబుతున్నారు.

ఆత్మ, మాన రక్షణ కోసం మహిళలు రోకలి బండలు, కత్తులు దగ్గర పెట్టుకోవాలట. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. న్యాయమూ, చట్టం, పోలీసులపైన రాజకుమారికి నమ్మకం పోతున్నట్లుంది. ఎందుకంటే, చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించాలని మహిళా సంఘాలు ఎంత మొత్తుకుంటున్నా వినేవారు లేరు.

అత్యాచారాలు పెరిగిపోతున్నాయని స్వయంగా రాజకుమారే చంద్రబాబు, డిజిపిలను కలిసి ఎన్నో మార్లు మొత్తుకున్నారు. అయినా ఫలితం కనిపించలేదు. దాంతో అత్యాచారాలు జరిగిన తర్వాత మొత్తుకునేకన్నా ముందే జాగ్రత్త పడటం మంచిదని అనుకున్నట్లున్నారు. అందుకనే మహిళలందరూ రోకలి బండలు, కత్తులు దగ్గర పెట్టుకోవాలని  చెబుతున్నారు.

గతంలో తాను ఇదే మాటలు చెప్పినపుడు అందరూ విమర్శించారని కానీ పరిస్ధితులు ఆ విధంగా ఉన్నాయంటూ నిష్టూరాలాడారు. ఇక, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ పైన కూడా నియంత్రణ అవసరమన్నారు. రాజకుమారి చెప్పిందాంట్లో తప్పేమీ లేదు. జరుగుతున్న నేరాల్లో కనీసం 25 శాతం సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పనిలో పనిగా టివిలు, సినిమాలపైన కూడా సెన్సార్ ఉండాలన్నారు లేండి. ప్రతీ నియోజకవర్గంలో మహిళా పోలీసుస్టేషన్లుండాలని కూడా చెప్పారు.

click me!