ఇది నా నైతిక బాధ్యత... పదవికి రాజీనామా చేసిన నన్నపనేని

By telugu teamFirst Published Aug 7, 2019, 1:48 PM IST
Highlights

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని... వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా తాను మహిళా ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి అందజేశారు.

ఈ సందర్భంగా నన్నపనేని మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని... వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా తాను మహిళా ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మూడేళ్ల వార్షిక నివేదికను తాను గవర్నర్ కి అందజేశానని ఆమె ఈ సందర్బంగా చెప్పారు. కాగా తన నివేదికను చూసి గవర్నర్ అభినందించినట్లు ఆమె చెప్పారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదికగా అడ్డంగా మారిందన్నారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని ఆమె చెప్పారు.

వసతి గృహాల్లో భద్రత పెచాల్సిన అవసరం ఉందని చెప్పారు.  రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్ట పరచాలని సూచించారు. 

click me!