జూనియర్ డాక్టర్‌ను కొట్టిన డీసీపీ: చర్యలకు జూడాల డిమాండ్

Published : Aug 07, 2019, 01:17 PM ISTUpdated : Aug 07, 2019, 04:01 PM IST
జూనియర్ డాక్టర్‌ను కొట్టిన డీసీపీ: చర్యలకు జూడాల డిమాండ్

సారాంశం

ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం వద్ద జూనియర్ డాక్టర్ పై  డీసీపీ హర్షవర్ధన్ కొట్టాడు. కాలర్ పట్టుకొని చెంపపై కొట్టాడు.

విజయవాడ: ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్‌పై డీసీపీ హర్షవర్ధన్ కాలర్ పట్టుకొని చెంపపై కొట్టారు. ఈ విషయమై జూనియర్ డాక్టర్లు డీజీపీ గౌతంసవాంగ్ కు ఫిర్యాదు చేశారు.

ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా  విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఎదుట జూనియర్ డాక్టర్లు వరుసగా ఆందోళనలకు దిగారు. బుధవారం నాడు కూడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. 

ఈ సమయంలో  ఆందోళన కారులను చెదరగొట్టే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.బుధవారం నాడు ఎన్టీఆర్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై డీసీపీ హర్షవర్ధన్ కాలర్ పట్టుకొని చెంపపై కొట్టాడు.

ఈ ఘటనను జూనియర్ డాక్టర్లు సీరియస్ గా తీసుకొన్నారు. డీసీపీ హర్షవర్ధన్ ప్రవర్తనపై జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. ఈ విషయమై డీజీపీకి జూనియర్ డాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్లు  వీడియో పుటేజీని కూడ డీజీపీకి అందించారు.

డీసీసీ హర్షవర్దన్‌ పై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 

"

PREV
click me!

Recommended Stories

టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu
Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu