అవిశ్వాసం: తప్పుతున్న టీడీపీ లెక్క, లోక్‌సభకు ఇద్దరు గైరాజరు?

First Published Jul 19, 2018, 3:43 PM IST
Highlights

కేంద్రప్రభుత్వంపై  అవిశ్వాసం సందర్భంగా జరిగే చర్చలో  నంద్యాల ఎంపీ ఎస్పీవై రె్డ్డి  పార్లమెంట్‌కు హాజరౌతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీ నాయకత్వం కూడ ఈ విషయంలో ఆయనపై పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. 


నంద్యాల: కేంద్రప్రభుత్వంపై  అవిశ్వాసం సందర్భంగా జరిగే చర్చలో  నంద్యాల ఎంపీ ఎస్పీవై రె్డ్డి  పార్లమెంట్‌కు హాజరౌతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీ నాయకత్వం కూడ ఈ విషయంలో ఆయనపై పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. 

ఇప్పటికే  తాను పార్లమెంట్‌కు హజరయ్యేది లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ  తాను పార్లమెంట్‌కు హాజరుకానని  జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడం పట్ల  టీడీపీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.తన డిమాండ్ల సాధన కోసం జేసీ దివాకర్ రెడ్డి ఇదే సమయాన్ని అనువుగా ఎంచుకొని పార్టీ నాయకత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ సీనియర్లు కొందరు  జేసీ తీరును తప్పుబడుతున్నారు.

మరోవైపు అనారోగ్య కారణాలతో ఎస్పీవై రెడ్డి కూడ  పార్లమెంట్‌కు హజరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే  ప్రచారం సాగుతోంది.  నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే  ఆయన వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.  ఆ తర్వాత కూడ  ఆయన పెద్దగా ఎక్కడ కూడ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. 

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంకా నంద్యాలలోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పార్టీ నుండి మినహయింపులు లభించే అవకాశం లేకపోలేదంటున్నారు. 

ఇదిలా ఉంటే  ఎస్పీవైరెడ్డి వైసీపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో విజయంసాధించినా.... ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఎస్పీవై రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.కానీ, ఇంతవరకు  ఈ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు జేసీ వ్యవహారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  జేసీ డిమాండ్లు నెరవేరిస్తే ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను కూడగడుతున్న టీడీపీకి స్వంత పార్టీ ఎంపీల కారణంగానే తలనొప్పులు వచ్చాయి. ఈ కీలకసమయంలో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరం  ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది.  ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యానే  ఎస్పీవై రెడ్డి  పార్లమెంట్‌కు హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.దీంతో అవిశ్వాసానికి అనుకూలంగా  తమకు  ఓట్లు వస్తాయని  టీడీపీ నేతలు వేసిన  లెక్కలు  తప్పుతున్నాయి.

click me!