హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

By tirumala AN  |  First Published Jun 4, 2024, 8:36 AM IST

నందమూరి బాలకృష్ణపై వైసిపి అభ్యర్థి దీపికా పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయంసాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు.


ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటకకు సమీపంలో వుండే హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఈ పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం, అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. సైకిల్ ఇక్కడ గెలిచినంతగా రాష్ట్రంలో మరెక్కడా గెలవలేదని చెప్పాలి. కుప్పంలోనూ చంద్రబాబు ఏడుసార్లు మాత్రమే గెలవగా.. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధులు 10 సార్లు విజయం సాధించారు. ఇక్కడ సైకిల్ జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని మహామహులు ట్రై చేసినా వల్ల కాలేదు. 

హిందూపురం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టలేరా :

Latest Videos

అభ్యర్ధితో సంబంధం లేకుండా టీడీపీని గెలిపించడం ఒక్కటే తమకు తెలుసు అన్నట్లుగా హిందూపురం ప్రజలు ముందుకు సాగుతున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ 10 సార్లు , స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,327 మంది. పర్యాటకంగా, సాంస్కృతికపరంగా, పారిశ్రామికపరంగా హిందూపురం రాష్ట్రంలోనే కీలకమైన నియోజకవర్గం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణకు 91,704 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్ధి షేక్ మొహమ్మద్ ఇక్బాల్‌కు 74,676 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీడీపీ 17,028 ఓట్ల తేడాతో విజయం సాధించి హిందూపురంలో తనకు తిరుగులేదని నిరూపించింది.

హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై బాలయ్య కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని పట్టుదలతో వున్నారు. తన కుటుంబానికి, పార్టీకి అచ్చొచ్చిన నియోజకవర్గంలో అన్ని రకాల అస్త్రశస్త్రాలతో బరిలో దిగుతున్నారు. దీనికి తోడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా కలిసిరావడంతో మరోసారి తన విజయం ఖాయమని బాలయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు కావడంతో పాటు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు బాలయ్య. 

మరోవైపు టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్ధితో ప్రయోగం చేసినా విఫలమవ్వడంతో ఈసారి మహిళా అస్త్రాన్ని ప్రయోగించారు జగన్. బీసీ వర్గానికి చెందిన దీపికను అభ్యర్ధిగా ప్రకటించారు. మహిళా ఓటు బ్యాంక్‌తో పాటు బీసీ సామాజికవర్గానికి నేత కావడంతో తమకు కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు. దీనికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అండదండలు పుష్కళంగా వున్నాయి. 

నందమూరి బాలకృష్ణపై వైసిపి అభ్యర్థి దీపికా పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయంసాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇక వైసిపి నుంచి దీపికా విజయం సాధించి జగన్ కి నియోజకవర్గాన్నిగిఫ్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారు. ఏపీ హాట్ సీట్స్ లో హిందూపురం ఒకటని చెప్పొచ్చు. 

హిందూపురంలో ఉన్న మండలాలు : 

1. హిందూపూర్ 

2. లేపాక్షి 

3. చిలమత్తూర్ 

మరి ఏ మండలంలో ఎవరు ఆధిక్యం సాధిస్తారు ? ఓవరాల్ గా ఎవరు విజయం సాధిస్తారో మరికాసేపట్లో తేలిపోనుంది. 

click me!