నందిగం సురేష్ కి మరో కీలక పదవి

Published : Jun 27, 2019, 11:52 AM IST
నందిగం సురేష్ కి మరో కీలక పదవి

సారాంశం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కి జగన్ మరో కీలక పదవి కట్టబెట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేతగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని నియమించారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కి జగన్ మరో కీలక పదవి కట్టబెట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేతగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని నియమించారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. 

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసిన నందిగం సురేష్‌.. టీడీపీ అభ్యర్థి మల్యాద్రి శ్రీరామ్‌పై 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు