రంగంలోకి బాబు: కాపు నేతలకు బుజ్జగింపు

Published : Jun 27, 2019, 11:28 AM IST
రంగంలోకి బాబు: కాపు నేతలకు బుజ్జగింపు

సారాంశం

 అసంతృప్తిగా ఉన్న కాపు నేతలను బుజ్జగించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. అసంతృప్తిగా ఉన్న నేతలు  చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇవాళ లేదా రేపు  కాపు నేతలు బాబుతో భేటీకానున్నారు.

అమరావతి: అసంతృప్తిగా ఉన్న కాపు నేతలను బుజ్జగించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. అసంతృప్తిగా ఉన్న నేతలు  చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇవాళ లేదా రేపు  కాపు నేతలు బాబుతో భేటీకానున్నారు.

యూరప్  పర్యటనను ముగించుకొని అమరావతికి వంగళవారం రాత్రి చంద్రబాబునాయుడు వచ్చారు. బుధవారం నాడు  పార్టీ నేతలతో బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి  కొందరు నేతలు  గైర్హాజరయ్యారు.

 చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో  కాకినాడలో  14 మంది కాపు నేతలు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి హాజరైన కొందరు కాపు నేతలు చంద్రబాబునాయుడు సమావేశానికి హాజరయ్యారు. 

విజయవాడలో అందుబాటులో ఉన్న నేతలు కూడ ఈ సమావేశానికి  రాలేదు. అయితే బాబు నిర్వహించిన సమావేశానికి  కొందరు నేతలకు ఆహ్వానం లేదు. మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడంపై చంద్రబాబునాయుడు ఆరా తీశారు. మాజీ మంత్రులు నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులతో బాబు చర్చించారు. కాపు నేతలు ప్రత్యేకంగా ఎందుకు సమావేశం నిర్వహించారనే విషయమై ఆయన చర్చించారు.  

మాజీ మంత్రులు కొందరు కాపు నేతలతో ఫోన్లో చర్చించారు. పార్టీ తీసుకొన్న కొన్ని నిర్ణయాలపై పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను బాబు వద్ద ప్రస్తావించేందుకు అసంతృప్త నేతలు సిద్దమయ్యారు. ఒకరిద్దరు మాత్రం చంద్రబాబుతో సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.వీలైతే ఇవాళ లేదారేపు చంద్రబాబుతో కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం కానున్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu