పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే జూ.ఎన్టీఆర్‌ తిరిగి టీడీపీలోకి : లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 08, 2023, 06:51 PM IST
పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే జూ.ఎన్టీఆర్‌ తిరిగి టీడీపీలోకి : లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ తిరిగి టీడీపీలోకి వస్తారని అన్నారు వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని ఆమె వ్యాఖ్యానించారు.  

ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నాయకత్వాన్ని సమర్ధించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అన్నారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడని తాను భావిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ని ఎవరూ ఎదిరించలేరని.. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా జగన్ వెంట వెన్నారని లక్ష్మీపార్వతి అన్నారు. టీటీడీ నిర్వహణ బాగుందని ఆమె కితాబిచ్చారు. 

ALso REad: ఏపీ ప్రజలు జూ.ఎన్టీఆర్‌‌ను కోరుకుంటున్నారు... లోకేష్‌ను కాదు : ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ఇదే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. లోకేష్‌ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని.. కానీ లోకేష్‌ను ఎవరూ కోరుకోవడం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై చంద్రబాబుకు ప్రేమ వుంటే.. ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను సీఎంను చేయాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్, తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం వుందో ప్రజలకు తెలుస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

భార్య కోరిక తీర్చిన పవన్ మురిసిపోయిన అన్నా లెజినోవా | Pawan Kalyan Buys Doll for Wife Anna Konidela
తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu