Rajamahendravaram: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, అంతకుముందు రోజు చంద్రబాబు కోసం టీడీపీ నాయకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఒక శక్తివంతమైన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తర్వాతి రోజు చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయన పూజలు ఫలించాయంటూ సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nandamuri Balakrishna: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, అంతకుముందు రోజు చంద్రబాబు కోసం టీడీపీ నాయకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఒక శక్తివంతమైన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తర్వాతి రోజు చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయన పూజలు ఫలించాయంటూ సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు కోసం బాలకృష్ణ తమిళనాడులోని ప్రముఖ దేవాలయమైన అది తిరునాగేశ్వరం నాగనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయన ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు తొలగిపోవాలని బాలయ్య ఈ పూజా కార్యక్రమాలు చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం చంద్రబాబు కు బెయిల్ లభించడంతో బాలకృష్ణ ఆయనకు దైవ ప్రసాదం, ఆశీర్వాద ఫలాన్ని అందించారు. జైలు నుంచి బయటకు రావడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఇక బాలయ్య ప్రత్యేక పూజలు.. తర్వాత రోజే చంద్రబాబుకు బెయిల్ లభించడంతో పూజలు ఫలించాయంటూ సోషల్ మీడియాలో సంబంధిత దృశ్యాలు వైరల్ గా మారాయి.
undefined
ఇదిలావుండగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాటని చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయవాదులు అందించిన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. సోమవారం వాదనలు విన్న కోర్టు.. తీర్పును నేటికి రిజర్వ్‌లో ఉంచి.. నవంబర్ 24 వరకు టీడీపీ అధినేతకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 28న చంద్రబాబు నాయుడు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 10కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించడంతో టీడీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌పై రాత్రి 10 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాలతో ఇప్పుడు మధ్యంతర బెయిల్ పొందారు.