మావోలకు పేలుడు పదార్థాల సప్లై: నక్కా అరెస్టు

By pratap reddyFirst Published Dec 24, 2018, 1:22 PM IST
Highlights

నక్కా వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ నక్సలిజం వ్యాప్తిలో నక్కా సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు దుర్గ్ రేంజ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ జీపి సింగ్ చెప్పారు. 

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్ లో హైదరాబాదులో నివాసం ఉంటున్న నక్కా వెంకటరావును పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుండగా అతన్ని పట్టుకున్నారు. 2016, 2017ల్లో నక్కా వెంకటరావు మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలతో సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. 

నక్కా వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ నక్సలిజం వ్యాప్తిలో నక్కా సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు దుర్గ్ రేంజ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ జీపి సింగ్ చెప్పారు. 

నిందితుడు నక్కా వెంకటరావు ఎన్జీఆర్ఐ ఉద్యోగి. ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టుల నెట్ వర్కును పటిష్టం చేయడానికి నక్కా వెంకటరావు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. నక్కా అరెస్టుతో అర్బన్ నక్సలిజం వ్యాప్తికి అడ్డు కట్ట చేవేసినట్లు సింగ్ చెప్పారు.

లొంగిపోయిన నక్సలైట్లు అర్బన్ నెట్ వర్కు గురించి చెప్పినట్లు, మూర్తి అనే జాతీయ సమన్వయకర్త ఎంఎంసి జోన్ కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ తెల్తుమడేను కలవడానికి వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, దాంతో తనిఖీలు నిర్వహించామని, రాజ్ నంద్ గావ్ పోలీసు స్టేషన్ పరిధిలో నక్కా వెంకటరావు అలియాస్ మూర్తి వెంకట రావు అలియాస్ సాహెబ్ వెంకటరావు (54)ను అరెస్టు చేశామని చెప్పారు. 

నక్కా వెంకటరావు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందినవాడు. పలు పత్రాలను, ఓ మొబైల్ ను, రెండు మెయిన్ పాక్ సెట్ కమ్ చార్జర్ ను, 23 డెటొనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సింగ్ చెప్పారు.  తన తమ్ముడు నారాయణ రావు తనకు వైర్ లెస్ సెట్ ఇచ్చినట్లు వెంకటరావు పోలీసు విచారణలో చెప్పాడు. 

click me!