వివాహేతర సంబంధం: స్నేహితుడిని లారీతో తొక్కించి చంపాడు

Published : Oct 04, 2020, 10:15 AM IST
వివాహేతర సంబంధం:  స్నేహితుడిని లారీతో తొక్కించి చంపాడు

సారాంశం

తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో  స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. 

బొబ్బిలి: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో  స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. 

కృష్ణా జిల్లాకు చెందిన  ముల్పూరి రాంగోపాల్.... అదే గ్రామానికి చెందిన తోట నాగేంద్ర బాబు స్నేహితులు. నాగేంద్రబాబు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఈ ఏడాది ఆగష్టు 28వ  తేదీన హైద్రాబాద్ వెళ్తున్నానని రాంగోపాల్ తన ఇంట్లో చెప్పి వెళ్లాడు. సెప్టెంబర్ 5వ తేదీన  ఆయన ఫోన్ పనిచేయలేదు. దీంతో కుటుంబసభ్యులు అనుమానంతో పోలీసులను  ఆశ్రయించారు.

పోలీసులు రాంగోపాల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తే ఆయన ఫోన్ సిగ్నల్స్ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఫోన్ సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు.

దీంతో పోలీసులు బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగా పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పిన రాంగోపాల్ తన స్నేహితుడు నాగేంద్రబాబు లారీలో గుజరాత్ వెళ్లాడు. గుజరాత్  నుండి మార్బుల్స్ లోడ్ ను తీసుకొని బొబ్బిలికి సెప్టెంబర్ 5న వచ్చారు. 

మార్బుల్స్ లోడ్ ను దింపిన తర్వాత  అక్కడే ఉన్న పారిశ్రామిక వాడలో నాగేంద్రబాబు, రాంగోపాల్ మద్యం తాగారు.

ఆ సమయంలో లారీ క్లీనర్ శివ కూడ ఉన్నారు. మద్యం తాగిన తర్వాత క్లీనర్ శివ లారీలో పడుకొన్నాడు. బాగా మద్యం తాగిన తర్వాత రాంగోపాల్ ను లారీతో  తొక్కించాడు నాగేంద్రబాబు.

అయితే లారీలో ఉన్న క్లీనర్ శివ నిద్ర నుండి లేచిన తర్వాత  రాంగోపాల్ గురించి ప్రశ్నించాడు. అయితే విశాఖలోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడని చెప్పాడు. అందుకే విశాఖలో దిగిపోయాడని చెప్పారు. 

తన భార్య రాంగోపాల్ తో సన్నిహితంగా ఉందనే అనుమానంతో నాగేంద్రబాబు ఈ హత్య చేసినట్టుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: దేశం మొత్తం అమరావతికి అండగా నిలిచింది: చంద్రబాబు | Asianet News Telugu
Ambati Rambabu Comments on CM Chandrababu: చంద్రబాబుపై రెచ్చిపోయిన అంబటి | Asianet News Telugu