అచ్చెన్నాయుడు అరెస్ట్ పై నాగబాబు షాకింగ్ ట్వీట్స్

Published : Jun 13, 2020, 10:34 AM IST
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై నాగబాబు షాకింగ్ ట్వీట్స్

సారాంశం

మెగా బ్రదర్ ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలు కొందరు నాగబాబు ట్వీట్ కి మండిపడటం గమనార్హం. కొందరు మాత్రం మద్దతు పలికారు..

ఈఎస్ఐ కుంభకోణం కేసులో శుక్రవారం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా..అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఘటనపై స్పందించారు.

అయితే.. మెగా బ్రదర్ ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలు కొందరు నాగబాబు ట్వీట్ కి మండిపడటం గమనార్హం. కొందరు మాత్రం మద్దతు పలికారు..

ఇంతకీ నాగబాబు ఏం ట్వీట్ చేశారంటే... ‘టీడీపీ హయాంలో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియా లో ఏదో అన్నారు అని మా జనసేన కార్య కర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. వాళ్ళని గొడ్లని బాది నట్లు బాది.. అంత హింసపెట్టిన టీడీపీ, ఇప్పడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీస్ అరెస్ట్ చేస్తే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతున్నారని’మండిపడ్డారు.

 

‘వాళ్ళు ఆఫ్ట్రాల్ కార్యకర్తలు, నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశ్యం. కర్మకు ప్రత్యేక సిద్ధాంతం ఏమీ లేదని.. you get what you deserve..మా జనసేన కార్యకర్తల ని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీ కి అంత తేలిగ్గా పోతుందా అన్నారు. మా జనసైనికులకు మీరు ఏం చేశారో మేం ఎప్పటికీ మర్చిపోము’ అన్నారు నాగబాబు. 

ఇదిలా ఉంటే నాగబాబు ట్వీట్‌పై కొందరు జనసైనికులు మండిపడుతున్నారు. నాగ బాబు గారు మీరు ఒక ట్వీట్ చేసే ముందు పార్టీ వాళ్ళ తో మాట్లాడతారా? మీ వల్ల పార్టీ కి చెడ్డ పేరు వస్తోందంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu
పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu