నాథూరామ్ గాడ్సే దేశభక్తిపై నాగబాబు సంచలన ట్వీట్

Published : May 19, 2020, 06:34 PM IST
నాథూరామ్ గాడ్సే దేశభక్తిపై నాగబాబు సంచలన ట్వీట్

సారాంశం

నాథూరామ్ గాడ్సేపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సంచలనమైన ట్వీట్ చేశారు. నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా నాగబాబు అభివర్ణించారు.

హైదరాబాద్: మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేపై సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడని, నాథూరామ్ గాడ్సే దేశభక్తిని శంకించలేమని ఆయన అన్నారు.  

"ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable.కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు" అని నాగబాబు అన్నారు.

"కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అని అన్నారు.

నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు. ఇది ఏ విధమైన వివాదానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు