వకీల్ సాబ్ మీద పేర్ని నాని సెటైర్లు: రేబిస్ వ్యాక్సిన్ పంపాలని నాగబాబు కౌంటర్

Published : Apr 12, 2021, 02:47 PM ISTUpdated : Apr 12, 2021, 02:48 PM IST
వకీల్ సాబ్ మీద పేర్ని నాని సెటైర్లు: రేబిస్ వ్యాక్సిన్ పంపాలని నాగబాబు కౌంటర్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై ఏపీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. దానిపై పవన్ కల్యాణ్ సోదరుడు, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.

అమరావతి:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం వివాదం చోటు చేసుకుంది. అది రాజకీయ రంగును కూడా పులుముకుంది. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బిజెపి నేత సునీల్ ధియోదర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు పట్టారు 

మరో వైపు పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్' సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి రేటింగ్ సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా బెనెఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. 

దీంతో, పవన్ కల్యాణ్ కు భయపడే స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దియోధర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ 'మీకు దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకే వెళ్తే షో వేయరు సునీల్ గారూ' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, 'మీకు ఏమి అయ్యింది నాని గారూ... మీరు కరోనా వాక్సిన్ తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని, స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ' అని వ్యాఖ్యానించారు. కుక్క కరిచిన వారికి రేబిస్ ఇంజెక్షన్లు వేస్తారనే విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu