మాంసం వ్యాపారిని కసితీరా నరికి చంపి.. శరీరాన్ని రెండు ముక్కలుగా కోసి, మూటకట్టి....

Published : Aug 17, 2021, 09:52 AM IST
మాంసం వ్యాపారిని కసితీరా నరికి చంపి.. శరీరాన్ని రెండు ముక్కలుగా కోసి, మూటకట్టి....

సారాంశం

పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి గరికే ఏడుకొండలు  తన కుమారుడితో కలిసి..  సహచర మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్యను శనివారం చంపేశాడు. ఆ తరువాత కాలువలో పడేశానని ఆదివారం కూచిపూడి పోలీసులకు లొంగిపోవడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపి, ముక్కలుగా చేసి... నీళ్లలో పడేశారు. అదీ తండ్రీ కొడుకులే కలిసి చేయడం స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి వాళ్లకు బాగా తెలిసిన వ్యక్తే కావడంతో అసలు ఇంత దారుణంగా చంపడానికి కారణమేంటీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తండ్రీ కొడుకులు కలిసి ఒక వ్యక్తిని కసితీరా నరికి చంపిన ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి శరీరాన్ని రెండు భాగాలుగా చేశారు. ఆ తర్వాత మూటకట్టి కాలువల తోసేశారు. పోలీసుల కథనం ప్రకారం…  

పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి గరికే ఏడుకొండలు  తన కుమారుడితో కలిసి..  సహచర మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్యను శనివారం చంపేశాడు. ఆ తరువాత కాలువలో పడేశానని ఆదివారం కూచిపూడి పోలీసులకు లొంగిపోవడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

నిందితులు ఇచ్చిన సమాచారంతో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి కేఈబీ నుంచి శ్రీకాకుళం, వెలువోలు వరకు గాలించారు.  చల్లపల్లి మండలం వెలువోలు వద్ద రెండు ముక్కలుగా ఉన్న నాంచారయ్య మృతదేహాన్ని గుర్తించారు. తల నుంచి పొట్ట వరకూ బాగానే మూటకట్టి కాలువలో తొక్కేశారు. కింది భాగాన్ని కాలువ గట్టుపై పడేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుడి అన్న కుమారుడు గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చల్లపల్లి ఎస్ఐ డి.సందీప్‌ తెలిపారు. హత్యకు గల కారణాలను, పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తులో నిగ్గు తేలుస్తామని డీఎస్పీ మహబూబ్ పాషా తెలిపారు. అయితే వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu