నీ భార్యకు దయ్యం పట్టింది, వదిలిస్తా...భర్తను బయటకు వెళ్లమని

sivanagaprasad kodati |  
Published : Jan 29, 2019, 07:58 AM IST
నీ భార్యకు దయ్యం పట్టింది, వదిలిస్తా...భర్తను బయటకు వెళ్లమని

సారాంశం

భార్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో భయపడిన భర్త ఆమెను గ్రామంలోని భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. వివాహితపై కన్నేసిన అతను మంత్రాల ముసుగులో అత్యాచారం చేయబోయాడు . 

భార్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో భయపడిన భర్త ఆమెను గ్రామంలోని భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. వివాహితపై కన్నేసిన అతను మంత్రాల ముసుగులో అత్యాచారం చేయబోయాడు .

వివరాల్లోకి వెళితే, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలానికి ఒక వ్యక్తి తన భార్య అప్పుడుప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటం, తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో గ్రామంలోని తాయెత్తు సాయిబు దగ్గరకు తీసుకెళ్లాడు.

ఆమెను పరీక్షించిన అతను నీ భార్యకు దెయ్యం పట్టిందని, మంత్రాలతో దానిని వదిలిస్తానని నువ్వు బయటకు వెళ్లాలని చెప్పాడు. ఇది నమ్మిన అతను భార్యను అక్కడే ఉంచి గది బయటకు వచ్చాడు.

మంత్రాలు బిగ్గరగా చదువుతున్నట్లు నటిస్తూనే సాయిబు అత్యాచారయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సాయిబును అదుపులోకి తీసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు