గుడివాడ అమర్నాథ్ ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మల్ల బుల్లి బాబుపై హత్యాయత్నం...(వీడియో)

Published : Sep 04, 2021, 09:57 AM IST
గుడివాడ అమర్నాథ్ ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మల్ల బుల్లి బాబుపై హత్యాయత్నం...(వీడియో)

సారాంశం

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఎవరు హత్యాయత్నానికి పాల్పడ్డారు? ఎందుకు జరిగింది? ఎలా గుర్తించారు? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అనకాపల్లి : కశింకోట మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్ల బుల్లి బాబుపై హత్యాయత్నం జరిగింది. వెదురుపర్తి రోడ్లో ఉన్న ఆయన గెస్ట్ హౌస్ వద్ద ఈ దాడి జరిగింది. రక్తపు మడుగులో ఉన్న బుల్లిబాబు అనకాపల్లి లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

"

 ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఎవరు హత్యాయత్నానికి పాల్పడ్డారు? ఎందుకు జరిగింది? ఎలా గుర్తించారు? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. భూ లావాదేవీలే ఇందుకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. బుల్లిబాబు మొదట తెలుగుదేశం పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి, అనంతరం కాంగ్రెసులో చేరి కసింకోట సర్పంచ్ గా గెలుపొందారు. అనంతరం వైసీపీలో చేరారు.

ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ కు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. కసింకోట వ్యవహారాలన్నీ బుల్లిబాబు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్