అధికారుల నిర్లక్ష్యం: జగన్ సీఎం కాదట, కమీషనర్ అట

By Nagaraju penumalaFirst Published Oct 2, 2019, 1:57 PM IST
Highlights

ముఖ్యమంత్రిని మున్సిపల్ కమిషనర్ గా, స్థానిక ఎమ్మెల్యేని ప్రత్యేక అధికారిగా మార్చేశారంటూ సెటైర్లు వేశారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో మీడియా సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

పార్వతిపురం: వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే దేశమంతా ఠక్కున చెప్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని. కానీ విజయనగరం జిల్లా మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం సీఎం ను కాస్త మున్సిపల్ కమిషనర్ చేసేశారు. 

స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావును సైతం అధికారిగా మార్చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా పదవి కట్టబెట్టేశారు. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం తేట తెల్లమైంది. 

పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని బెలగాం చర్చ్ వీధిలో వార్డ్ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు వేయించారు. అయితే ఆ ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వేయించాల్సింది పోయి మున్సిపల్ కమిషనర్ అంటూ జగన్ ఫోటో కింద పేరు వేయించారు. 

ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే అయిన అలజింగి జోగారావును సైతం అధికారిగా మార్చేస్తూ ఫ్లెక్సీ వేయించారు అధికారులు. అలా తప్పుగా ప్రింట్ అయిన ఫ్లెక్సీలనే ప్రచారానికి వినియోగించారు అధికారులు. 

అయితే ఫ్లెక్సీలలో మున్సిపల్ అధికారుల తప్పిదాలను గమనించిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని మున్సిపల్ కమిషనర్ గా, స్థానిక ఎమ్మెల్యేని ప్రత్యేక అధికారిగా మార్చేశారంటూ సెటైర్లు వేశారు. 

ఈ విషయం మీడియాకు తెలియడంతో మీడియా సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాన్ని చూసిన అధికారులు అప్పుడు అలర్ట్ అయ్యారు. వెంటనే ఫ్లెక్సీల కింద పేర్లను తొలగించి పిన్ కొట్టేశారు. 

అప్పటికే ఫ్లెక్సీల వ్యవహారం దావానంలా వ్యాపించడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి తప్పులు మున్మందు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారుల తీరును తప్పుబట్టారు. 

click me!