టీటీడీకి రూ.300 కోట్ల విరాళం.. ముంబై భక్తుడి కానుక

Siva Kodati |  
Published : Mar 12, 2021, 02:23 PM IST
టీటీడీకి రూ.300 కోట్ల విరాళం.. ముంబై భక్తుడి కానుక

సారాంశం

టీటీడీకీ భారీ విరాళం ప్రకటించాడు ముంబైకి చెందిన ఓ భక్తుడు. సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు

టీటీడీకీ భారీ విరాళం ప్రకటించాడు ముంబైకి చెందిన ఓ భక్తుడు. సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు.

భక్తుడు సంజయ్ సింగ్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరపనున్నారు. మరోవైపు సంజయ్ సింగ్‌ని అభినందించి టీటీడీ.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 49,707 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 21,638 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే