కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ముధవారం నాడు లేఖ రాశారు.ఈ లేఖలో కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కోరారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు kapu ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నాడు లేఖ రాశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలకు కొన్ని పేర్లను ఆ లేఖలో సీఎం జగన్ కు సూచించారు Mudragada Padmanabham
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరును ఆయన సూచించారు. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరును పెట్టాలని కూడా ఆయన కోరారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి శ్రీకారం చుట్టారని పత్రికలలో చూశానన్నారు.
దయచేసి అవకాశం ఉంటే మనసుపెట్టి పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించాలని ఆయన ఆ లేఖలో సీఎంను కోరారు. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ఆ లేఖలో సీఎం ను ముద్రగడ పద్మనాభం కోరారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని ఇవాళ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Nilam Sawhney నేతృత్వంలో 2020 ఆగష్టు 9వ తేదీన అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. New జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ ఈ కమిటి అధ్యయనం చేసింది.2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
గత నాలుగు రోజుల క్రితం కూడా ఓటీఎస్‌పై లేఖ ద్వారా జగన్ సర్కార్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసందే. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను కోరారుగత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగారు.గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు.