బాబు పై ముద్రగడ హోదా దాడి

Published : Jan 30, 2017, 09:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
బాబు పై ముద్రగడ  హోదా దాడి

సారాంశం

హోదా కోసం పోరాడాలని ముఖ్య మంత్రి బాబుకు, పుత్రడు లోకేశ్ కు ముద్రగడ సలహా

కాపు రిజర్వేషన్ ఉద్యమనాయకుడు చంద్రబాబు మీద కొత్త దాడి ప్రారంభించారు.

 

ఆయన కాపు పాదయాత్ర పోలీసు నిర్బంధం మధ్య ప్రతిసారి ఆగిపోతూన్న సంగతి తెలిసిందే. ఇపుడాయన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశుడి మీద  హోదా దాడి మొదలుపెట్టారు.

 

హోదా కోసం పోరాడితే పోలవరం పోతుందన్న వాదన కట్టిపెట్టమని సలహ ఇచ్చారు.

 

ఆంధ్రప్రదేశ్  కు ప్రత్యే క హోదా వద్దనడం మానుకుని పోరాడాలని సూచిస్తూ  పుత్రుడు లోకేశ్ తో కలిసి ముఖ్యమంత్రి దీక్ష చేపట్టాలనిసూచించారు. ముఖ్యమంత్రి దీక్షకు కూచోవడమేమటని అనుకోవద్దని, తమిళనాడు ప్రయోజనాల కోసం ముఖ్యంగా కావేరీ జలాలా కోసం గతంలో జయలలిత  ఆమరణదీక్ష చేపట్టారని, అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా జంకాల్సిన పనిలేదనిముద్రగడ అన్నారు.

 

వారికి తోడుగా తానుంటానని చెబుతూ కొంచెం చోటు ఇస్తే తాను కూడావారి మధ్య కూర్చుంటానని కూడ ఆయన హమీ ఇచ్చారు.

 

కేంద్రంతో గొడవ పడితే, పోలవరం ప్రాజక్టు ఆగిపోతుందని ముఖ్యమంత్రి దబాయింపును ప్రస్తావిస్తూ పోలవరం జాతీయ హోదాకు చట్టబద్ధత ఉందని,అది రాష్ట్ర విభజన చట్టంలోని అంశమని ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తగువు పెట్టుకుంటే పోలవరం నిర్మాణం ఎలా ఆగిపోతుందో ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు.

 

 ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నా కాపు రిజర్వేషన్లు సాధించేవరకు తాను నిద్రపోయేది లేదని ఆయన చెప్పారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu