షాక్... జగన్ పై ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశంసల వర్షం

Published : Sep 06, 2019, 02:12 PM IST
షాక్... జగన్ పై ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశంసల వర్షం

సారాంశం

రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతిలో ఉన్నాయని.. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేశాకే అమరావతిని డెవలప్‌ చేయాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పోలవరాన్ని త్వరగా పూర్తిచేయాలని టీజీ వెంకటేష్ తెలిపారు.


బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీజీ వెంకటేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూలేనిది జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. న్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో నాలుగు ప్రాంతాలను రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతిలో ఉన్నాయని.. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేశాకే అమరావతిని డెవలప్‌ చేయాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పోలవరాన్ని త్వరగా పూర్తిచేయాలని టీజీ వెంకటేష్ తెలిపారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా... టీజీ వెంకటేష్ ఇటీవలే టీడీపీ ని బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

కాగా... అమరావతిని తరలించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి అధిష్టానంతో చర్చించారని టీజీ వెంకటేష్ గతంలో పేర్కొన్నారు. రాజధాని మారబోతోందన్న వార్తలకు ఆజ్యం పోసిందే టీజీ. అప్పటి నుంచి ఈ విషయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తర్వాత టీజీ  తాను చేసిన కామెంట్స్ ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కాగా... ఇప్పుడు ఆయనే స్వయంగా జగన్ పై ప్రశంసలు కురిపించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!