చంద్రబాబు ఫోటోను తొలగించిన సుజనా చౌదరి

Published : Jun 21, 2019, 04:36 PM IST
చంద్రబాబు ఫోటోను తొలగించిన సుజనా చౌదరి

సారాంశం

పార్టీ మారడంతో టీడీపీతో ఉన్న ప్రొఫైల్ ఫోటోలను తొలగించిన సుజనాచౌదరి తన నివాసంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటోను సైతం తొలగించారు. తన ఇంటి ఎంట్రన్స్ లో ఉన్న ఫోటోను  ఇంటిలో పనిచేసే సిబ్బంది తొలగించేయడం చర్చనీయాంశంగా మారింది. 

న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిపోవడంతో సుజనాచౌదరి తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చేశారు. 

ఫేస్ బుక్ ప్రొఫైల్ లో బీజేపీ కండువాతో ఉన్న ఫోటో, కింద ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలతో తన ఫేస్ బుక్ ప్రొఫైల్ మార్చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు వెబ్ సైట్లలో కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా మార్చేసుకున్నారు. 

పార్టీ మారడంతో టీడీపీతో ఉన్న ప్రొఫైల్ ఫోటోలను తొలగించిన సుజనాచౌదరి తన నివాసంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటోను సైతం తొలగించారు. తన ఇంటి ఎంట్రన్స్ లో ఉన్న ఫోటోను  ఇంటిలో పనిచేసే సిబ్బంది తొలగించేయడం చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సైబ‌రాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం
Andhra pradesh: అక్వాన్ తుఫాన్‌తో ఏపీకి భారీ ముప్పు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు