మా గొంతు నొక్కేసారు.. ఎంపీ కేశినేని

Published : Jan 05, 2019, 03:00 PM IST
మా గొంతు నొక్కేసారు.. ఎంపీ కేశినేని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే మా గొంతులు నొక్కేసారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే మా గొంతులు నొక్కేసారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ లో ఆందోళన చేసిన ఏపీ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో విజయవాడలో టీడీపీ నేతలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ హక్కుల కోసం తాము పార్లమెంటులో పోరాడామని, లోక్ సభ సాక్షిగా తమ గొంతు నొక్కేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టంలో ఉన్న వాటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. తమను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వ తూట్లు పొడుస్తోందని విమర్శించారు. మోదీ అసమర్థ ప్రధాని అని.. మోదీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. ఏపీకి అన్యాయం చేసిన ఏ పార్టీ గెలిచినట్లు దేశ చరిత్రలో లేదన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పారు. 2019లో బీజేపికి ఘోర పరాజయం దక్కడం ఖాయమని జోస్యం చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్