‘‘పవన్, జగన్ ని నేను ఒప్పిస్తా.. చంద్రబాబుకి ఒకేనా’’

Published : Jan 05, 2019, 02:01 PM IST
‘‘పవన్, జగన్ ని నేను ఒప్పిస్తా.. చంద్రబాబుకి ఒకేనా’’

సారాంశం

ఈ విషయంలో రాష్ట్రపతి వద్దకు కలిసి రావడానికి పవన్, జగన్ లను ఒప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. 


ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి వివరించాలని.. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. అఖిలపక్షం మొత్తాన్ని తీసుకువెళ్లి.. రాష్ట్రపతిని కలిస్తే.. రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో రాష్ట్రపతి వద్దకు కలిసి రావడానికి పవన్, జగన్ లను ఒప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. శనివారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌తో చలసాని సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని, కేంద్రం నిధులతో పోలవరం పూర్తిచేయాలని కోరామన్నారు. 

హోదా విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. మోదీ అండ్‌ కో ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకిచ్చిన హామీలు అమలు చేసి, రాష్ట్రానికి న్యాయం చేయాలని చలసాని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్