కడప స్టీల్ ప్లాంట్ కు లైన్ క్లియర్, డిసెంబర్ 27న శంకుస్థాపన

By Nagaraju TFirst Published Nov 28, 2018, 4:23 PM IST
Highlights

 కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ఏపీ సర్కార్, ఏపీఎండీసీ భాగస్వామ్యంతో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. డిసెంబర్ 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన జరగనుందని చెప్పారు. 


కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ఏపీ సర్కార్, ఏపీఎండీసీ భాగస్వామ్యంతో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. డిసెంబర్ 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన జరగనుందని చెప్పారు. 
బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరుగుతుందన్నారు. ఏపీఎండీసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. సుజనాచౌదరి విషయంలో ఈడీ కొత్తగా చెప్పిందేమీలేదని, ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 

సుజనా కూడా న్యాయపోరాటం చేస్తారని రమేష్‌ అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మోదీ దాడులు చేయిస్తున్నారని, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో మోదీకి ఎదురుదెబ్బ తప్పదన్నారు.

click me!