మాతృభాషకు గౌరవం పెరగడానికి కారణం జగన్: రఘురామ సెటైర్లు

By Sreeharsha GopaganiFirst Published Jul 31, 2020, 8:08 AM IST
Highlights

మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారిని చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడ స్ఫూర్తి పొందుతారో అని, వారు స్ఫూర్తిపొందకూడదు అని కేంద్రం మాతృభాషకు ప్రాధాన్యం కల్పించిందని రఘురామ అన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేకున్నప్పటికీ మాతృభాషకు ఇంత  దక్కడానికి ఏపీ ముఖ్యమంత్రే పరోక్షంగా కారణమయ్యారని రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... ఇంత గౌరం దక్కేలా చేసినందుకు జగన్ మోహన్ రెడ్డిగారిని అభినందిస్తున్నట్టుగా ఆయన అన్నారు. 

మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారిని చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడ స్ఫూర్తి పొందుతారో అని, వారు స్ఫూర్తిపొందకూడదు అని కేంద్రం మాతృభాషకు ప్రాధాన్యం కల్పించిందని రఘురామ అన్నారు. 

రాజ్యాంగంలో సైతం మాధ్యమం మాతృభాషలోనే ఉండాలని ఉందని, అదే విషయాన్నీ చెప్పి తెలుగులో విద్యాబోధన చేసి రాజ్యాంగాన్ని గౌరవించమని  చెప్పినందుకు,తనపై అనర్హత పిటిషన్ ఇచ్చారని అన్నారు. 

ఇప్పటికైనా ఆ పిటిషన్ ఉపసంహరించుకోవాలని, కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి కోర్టుల చుట్టూ  ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సైతం మాతృభాషలోనే విద్యాబోధనను స్వాగతించారు. ఐదో తరగతి వరకు విద్యాబోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానంలో నిర్ణయించడాన్ని తమ పార్టీ హర్షధ్వానాలతో స్వాగతిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి విదితమేనని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల పార్టీ 5 జిల్లాల ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన సమావేశానికి తనను పిలవలేదని, పిలవకపోవడం సమంజసం కాదని, పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 

click me!