పుట్టపర్తిలో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

Published : Jul 23, 2022, 05:17 PM ISTUpdated : Jul 23, 2022, 05:24 PM IST
పుట్టపర్తిలో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్య సాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. మృతులను భాగ్యమ్మ, ఆమె పిల్లలు బుజ్జి, లడ్డులుగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్య సాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. మృతులను భాగ్యమ్మ, ఆమె పిల్లలు బుజ్జి, లడ్డులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడివారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే భాగ్యమ్మ.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యచేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనతో భాగ్యమ్మ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలు ఇద్దరు ఐదేళ్ల లోపు వారే కావడంతో అక్కడి వారిని కదిలించింది. దీంతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?