కొడుకుకు వాతలు పెట్టిన తల్లి

Published : Aug 26, 2018, 05:24 PM ISTUpdated : Sep 09, 2018, 11:46 AM IST
కొడుకుకు వాతలు పెట్టిన తల్లి

సారాంశం

భర్తపై కోపాన్ని అభంశుభం తెలియని బాలుడిపై చూపించిందో తల్లి. తాను వెళ్లొద్దన్నా తండ్రికి దగ్గరకు వెళ్లడంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి బాలుడిపట్ల అమానుషంగా ప్రవర్తించింది

నెల్లూరు: భర్తపై కోపాన్ని అభంశుభం తెలియని బాలుడిపై చూపించిందో తల్లి. తాను వెళ్లొద్దన్నా తండ్రికి దగ్గరకు వెళ్లడంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి బాలుడిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. కాళ్లు, చేతులపై వాతలు పెట్టి ఆస్పత్రిపాల్జేసింది. అందర్నీ కలచివేస్తున్న ఈ ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం సూళ్లూరులో జరిగింది. 

సూళ్లూరుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి కుమారుడితో నివశిస్తోంది. తల్లికి తెలియకుండా తన తండ్రిని చూడటానికి వెళ్లాడు ఆ బాలుడు. తండ్రి దగ్గరకు కొడుకు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న ఆ తల్లి కొడుకు కాళ్లు, చేతులపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?