జంగా కృష్ణమూర్తి గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం: జంగా కొడుకు సర్పంచ్ గా ఎన్నిక

By narsimha lode  |  First Published Feb 18, 2021, 10:26 AM IST

: వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు  జంగా సురేష్  గామాలపాడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు పంచాయితీ సర్పంచ్ గా  జంగా సురేష్ ఎన్నికయ్యారు.


గుంటూరు: వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు  జంగా సురేష్  గామాలపాడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు పంచాయితీ సర్పంచ్ గా  జంగా సురేష్ ఎన్నికయ్యారు.

వైఎస్ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవిని జగన్ కట్టబెట్టారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా గామాలపాడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Latest Videos

undefined

గామాలపాడు సర్పంచ్ పదవి బీసీలకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు  సురేష్‌ను వైసీపీ  సర్పంచ్‌  పదవికి బరిలోకి దింపింది. బీటెక్‌ పూర్తిచేసిన సురేష్‌ ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్నారు. 

సర్పంచ్‌ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన మద్దతుదారులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. దీంతో సురేష్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి పెద్ద కొడుకు వెంకట కోటయ్య పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

click me!