ఢిల్లీలో దీక్ష చేయబోతున్నా...మోడీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్: చంద్రబాబు

By sivanagaprasad KodatiFirst Published Jan 29, 2019, 9:15 AM IST
Highlights

రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాయలసీమకు రెండు శుభవార్తలన్నారు. 

రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాయలసీమకు రెండు శుభవార్తలన్నారు.

కరువు సీమీలో కియా కార్లు పరిగెత్తడంతో పాటు, కృష్ణాజలాలు సీమకు తరలివస్తున్నాయని సీఎం అన్నారు. కియా కంపెనీతో రూ. 13, 500 కోట్లు, అనుబంధ పరిశ్రమలతో మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడి వచ్చిందన్నారు.

కియా ద్వారా 11 వేలు, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 4 వేలమందికి ఉపాధి లభించిందన్నారు. ఏడాదికి సగటున 3 లక్ష కార్ల తయారీ ఉత్పత్తి సామర్ధ్యంతో కియాను నెలకొల్పినట్లు తెలిపారు. మోడీ వల్లే కియా వచ్చిందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

జయహో బీసీ సదస్సుతో వైసీపీ బెంబేలెత్తిందన్నారు. అప్రాప్రియేషన్ బిల్లుకు ముందు రోజే ఢిల్లీలో దీక్ష చేస్తానని ఆయన తెలిపారు.  మోడీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్ అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేపటి అఖిలపక్ష భేటీలో ఢిల్లీపై ఒత్తిడి తేవాలని సీఎం సూచించారు. 

click me!