బీజేపీలో చేరను, టీడీపీలోనే ఉంటా : పుకార్లను నమ్మెుద్దు

By Nagaraju penumalaFirst Published Jun 21, 2019, 7:58 PM IST
Highlights

కాకినాడ సమావేశంలో టీడీపీ పటిష్టత కోసం చర్చించామని అలాగే కాపు సామాజిక వర్గం ఆర్థికంగా బలోపేతం చెందే అంశంపై చర్చించినట్లు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి, అటు విద్య, ఇతరత్రా అన్ని రంగాల్లో ఆదుకున్నా కాపులకు ఎందుకు దూరమయ్యామో అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. 

రాజంపేట: తెలుగుదేశం పార్టీ వీడి బీజేపీలో చేరతానంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు. తాను టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరతానంటూ వస్తున్నవి కేవలం అపోహలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్నానని, అప్పటి నుంచి తాను టీడీపీ పార్టీ వీడుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది సరికాదన్నారు. 

కాకినాడ సమావేశంలో టీడీపీ పటిష్టత కోసం చర్చించామని అలాగే కాపు సామాజిక వర్గం ఆర్థికంగా బలోపేతం చెందే అంశంపై చర్చించినట్లు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి, అటు విద్య, ఇతరత్రా అన్ని రంగాల్లో ఆదుకున్నా కాపులకు ఎందుకు దూరమయ్యామో అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో కాపులతో పాటు బలహీన వర్గాలను టీడీపీ వైపు ఎలా తిప్పుకోవాలో అనే అంశంపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలను ఎదుర్కొనే అంశంపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.  

రాజంపేట మున్సిపాలిటీ నుంచి స్థాని క సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టి ఇంటింటా ప్రచారం నిర్వహించి పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తాన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.  

తనను నమ్ముకుని సుమారు 60 వేల పైచిలుకు ఓట్లు వేసిన వారు ఉన్నారని వారి కోసం తాను నిత్యం పాటుపడతానని తెలిపారు. అంతేకానీ తాను పార్టీ మారిపోతానంటూ వస్తున్న వార్తలను చూసి ప్రజలు ఆందోళన చెందొద్దని హితవు పలికారు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు.  

click me!