కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీకి దిగిన మొండితోక అరుణ్ కుమార్ ఏపీ సీఎం జగన్ తో ఇవాళ భేటీ అయ్యారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు ఆయన సీఎం కు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సోమవారం నాడు కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం నుండి అరుణ్ కుమార్ ను వైసీపీ బరిలోకి దింపుతుంది.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఎమ్మెల్సీ స్థానానికి తనను అభ్యర్ధిగా ప్రకటించిన సీఎం జగన్ కు అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మొండితోక Arun kumar కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి Ys Jagan ఆప్యాయంగా మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తమకు ఎంతో ఉన్నతమైన అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తమ కుటుంబమంతా జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను Ycp మూడు రోజుల క్రితం ప్రకటించింది.ఇందుకూరు రాజు (విజయనగరం) వరుదు కళ్యాణి (విశాఖ)వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)తలశిల రఘురామ్ (కృష్ణా)ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(గుంటూరు)మురుగుడు హనుమంతరావు (గుంటూరు)తూమాటి మాధవరావు (ప్రకాశం)కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)వై శివరామిరెడ్డి (అనంతపురం) లను అభ్యర్ధులుగా వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో mla quota ఎమ్మెల్సీల్లో 3, local body quota కోటాలో 11 స్థానాలు భర్తీకానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుండగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ దక్కించుకొనే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా వైసీపీ పరం కానున్నాయి. ఇతర పార్టీలకు బలం లేనందున 14 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో ఏపీ శాసనమండలిలో వైసీపీ బలం పెరగనుంది.
also read:2022 జూన్ నాటికి 46 వేల కి.మీ. రోడ్ల మరమ్మత్తులు: జగన్ ఆదేశం
ప్రస్తుతం వైసీపీకి 12 మంది, టీడీపీకి 15 మంది, పీడీఎఫ్ కు నలుగురు, నలుగురు ఇండిపెండెంట్లు, బీజేపీకి ఒక్క సభ్యుడున్నారు. ఆరుగురిని గవర్నర్ నామినేట్ చేశారు.ఎమ్మెల్యే కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలున్నారు.గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి ఒకరు విజయం సాధించారు. ఆరుగురిని గవర్నర్ నామినేట్ చేశారు.ఈ ఆరుగురు కూడా వైసీపీ మద్దతుదారులే. 14 ఎమ్మెల్సీల్లో వైసీపీ విజయం సాదించనుండడంతో ఆ పార్టీ బలం 32కి పెరగనుంది.టీడీపీకి చెందిన కౌన్సిల్ ఛైర్మెన్ ఎంఏ షరీఫ్, బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి ఈ ఏడాది మే లో రిటైరయ్యారు. దీంతో మూడు స్థానాలకు ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించనున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే నెల 10న నిర్వహించనున్నారు.