తేడా రెడ్డి, బ్లూ మీడియా.. విజయసాయిపై బుద్ధా సెటైర్లు

Published : May 02, 2020, 02:58 PM IST
తేడా రెడ్డి, బ్లూ మీడియా.. విజయసాయిపై బుద్ధా సెటైర్లు

సారాంశం

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మరోసారి ట్వీట్ వార్ జరిగింది.

టీడీపీ, వైసీపీ ల మధ్య వైరం రోజు రోజుకీ పెరిగిపోతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరు చేసిన కామెంట్స్ కి.. మరొకరు సెటైర్లు, కౌంటర్లు వేయకుండా ఉండటం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మరోసారి ట్వీట్ వార్ జరిగింది.

విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బుద్దా చేసిన ట్వీట్ నెట్టింట టీడీపీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ‘‘తేడా రెడ్డికి ఆప్షన్ అంటే ఏంటో తెలియదు పాపం. విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆప్షన్ ఇవ్వండని అడిగితే ఇంగ్లీష్ వద్దంటారా అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. చంద్రబాబు.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుని చంపేస్తారా అంటూ బ్లూ మీడియా హడావిడి చేసింది. వైకాపా నాయకులు తెలుగు పరిరక్షణ కోసం పుట్టిన వీరుల్లా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు అవేవీ ఎరగనట్టు, ఈ రోజే జైలు నుంచి విడుదలైనట్టు, ఇంగ్లీష్ మీడియం కనిపెట్టినట్టు గన్నేరుపప్పు, తేడా రెడ్డి కట్టింగ్ ఇస్తున్నారు’’ అంటూ బుద్దా ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu