జనం నవ్వుతున్నారు, ఇంకా బుద్ధిరాలేదు.. చంద్రబాబుపై రోజా

Published : May 28, 2020, 12:17 PM IST
జనం నవ్వుతున్నారు, ఇంకా బుద్ధిరాలేదు.. చంద్రబాబుపై రోజా

సారాంశం

 రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై.. నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న తీర్మానాలు చూసి.. జనం నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ పదవి కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన ఫొటోకు దండేసి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

ఎమ్మెల్యేలను కొని, అందులో నలుగురిని మంత్రులను చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని బాబూ మర్చిపోయారా అని రోజా ఈ సందర్భంగా చంద్రబాబుని ప్రశ్నించారు. రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 

మద్యం దశలవారీ నిషేధం, మహిళలకు సున్నా వడ్డీ, 27 లక్షల ఇళ్ల పట్టాలు, 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. 33 పథకాలు చంద్రబాబు పెడితే పథకానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జనం ఎందుకు ఛీ కొడతారని ప్రశ్నించారు.

ప్రజలు మూలన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోను చంద్రబాబు టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని రోజా గుర్తు చేశారు. సీఎం జగన్‌ పాలనను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు