వైసీపీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ఎమ్మెల్యే నాగార్జున

Published : Apr 08, 2021, 03:29 PM ISTUpdated : Apr 08, 2021, 03:37 PM IST
వైసీపీ కార్యాలయంలో  కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ఎమ్మెల్యే నాగార్జున

సారాంశం

కరోనా ప్రోటోకాల్ కు విరుద్దంగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున  పార్టీ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొన్నారు.  

గుంటూరు: కరోనా ప్రోటోకాల్ కు విరుద్దంగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున  పార్టీ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను పీహెచ్ సీల్లో కానీ, కరోనా  సెంటర్ లో కానీ తీసుకోవాలి. కానీ కోవిడ్ ప్రోటోకాల్ కి విరుద్దంగా  వైసీపీకి చెందిన ఎమ్మెల్యే నాగార్జున  వైసీపీ కార్యాలయంలో టీకా తీసుకొన్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్  కూడ తన ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకొన్నాడు. ఏపీ రాష్ట్రంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్‌కి విరుద్దంగా  వ్యాక్సిన్ తీసుకోవడం విమర్శలు దారితీసింది.

ప్రధాని ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఏపీ సీఎం జగన్ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకొన్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రోటోకాల్ కి విరుద్దంగా  వ్యాక్సిన్ తీసుకోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో  కరోనా  వ్యాప్తిని తగ్గించేందుకు గాను ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ నెల మొదటివారంలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏపీ ప్రబుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu