ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాలు ఉన్నాయి.. రేపు మీడియా ముందు చూపిస్తాను: బాలినేని వ్యాఖ్యలకు కోటంరెడ్డి కౌంటర్

By Sumanth KanukulaFirst Published Jan 31, 2023, 9:19 PM IST
Highlights

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆధారాలు చూపిస్తానని అన్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆధారాలు చూపిస్తానని అన్నారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు పోతాయని ఇప్పటివరకు బయటపెట్టలేదని చెప్పారు. కానీ ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పదని అన్నారు. వైసీపీలో అసంతప్తులపై ఫోన్ ట్యాపింగ్ అందరికీ తెలియాలని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర హెం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. రేపు మీడియా ముందుకు రానున్నట్టుగా చెప్పారు. మీడియా ముందు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు చూపిస్తానని అన్నారు. 

ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లా వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి స్థానంలో అక్కడ మరో వ్యక్తిని పార్టీ ఇంచార్జ్‌ను నియమించనున్నట్టుగా చెప్పారు. ఎవరూ ఉన్న లేకపోయినా సీఎం జగన్ చరిష్మాతో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రేపటి రోజు శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు వస్తుందని అన్నారు.  వైసీపీ నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నవారే పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అతడు మాట్లాడిన వ్యక్తే రికార్డు చేసి ఆడియోను బయటకు వదిలాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే రుజువు చేయాలని అన్నారు. టీడీపీలో ఖాళీలు ఉన్నాయని.. టికెట్లు రావని అనుకున్నవారు అక్కడికి పోతారేమోనని విమర్శించారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తానని అంటున్నారని.. కానీ తమ పార్టీలో ఖాళీలు లేవని చెప్పారు.  

click me!