టీఆర్ఎస్ గెలిస్తే.. మీకెందుకు సంబరం..? గోరంట్ల

Published : Dec 13, 2018, 03:33 PM IST
టీఆర్ఎస్ గెలిస్తే.. మీకెందుకు సంబరం..? గోరంట్ల

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే... ఏపీలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే... ఏపీలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. కేసీఆర్ గెలిచారని.. జగన్,పవన్ లు సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.

గురువారం తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరించని టీఆర్ఎస్ గెలిస్తే.. ఇక్కడ సంబరాలేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్ర అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో అసలు అభివృద్ధి జరగలేదన్నారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu