ఎన్టీఆర్.. టీడీపీ కోసం పనిచేయాలి.. గోరంట్ల

Published : Mar 29, 2021, 03:41 PM IST
ఎన్టీఆర్.. టీడీపీ కోసం పనిచేయాలి.. గోరంట్ల

సారాంశం

తొలుత ఆయన సీనియర్ ఎన్టీఆర్  విగ్రహానికి నివాళులు ఆర్పించారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఆయనకు  నివాళులు అర్పించారు. అనంతరం గోరంట్ల మీడియాతో మాట్లాడారు.

తెలుగు దేశం పార్టీలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

తొలుత ఆయన సీనియర్ ఎన్టీఆర్  విగ్రహానికి నివాళులు ఆర్పించారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఆయనకు  నివాళులు అర్పించారు. అనంతరం గోరంట్ల మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్  స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో  ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పారు. గ్రౌండ్  రియాల్టీస్ ప్రకారం  టీడీపీలో కొత్త నాయకత్వం  రాబోతుందని స్పష్టంచేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు  టీడీపీ బలోపేతం  కోసం  పనిచేయాలని చెప్పారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్