గుంటూరు కారం సినిమా చూసిన బాలినేని.. వైసీపీ కీలక సమావేశానికి డుమ్మా...

By SumaBala Bukka  |  First Published Jan 13, 2024, 7:22 AM IST

హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో పాప్ కార్న్ తింటూ గుంటూరు కారం సినిమా చూస్తున్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మరో వైపు ప్రకాశం జిల్లా కొండేపిలో వైసీపీ కీలక నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బాలినేని గైర్హాజరయ్యారు. 


హైదరాబాద్ : మార్పులు, చేర్పులు వైసీపీనీ ఓ కుదుపు కుదుపుతున్నాయి. మూడు జాబితాలు విడుదలైన తర్వాత.. పార్టీ మారుతున్న వారి సంఖ్య, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి  సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫైరల్ గా మారుతుంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేతల సమావేశానికి బాలినేని శ్రీనివాసరెడ్డి డుమ్మా కొట్టారు.  హైదరాబాదులోని ఏఎంబిమాల్ లో గుంటూరు కారం సినిమా చూస్తుంటే  ఎవరో వీడియో తీశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాలు మీద కాలేసుకుని పాప్ కార్న్ తింటూ గుంటూరు కారం సినిమా చూస్తున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మరో వైపు ప్రకాశం జిల్లా కొండేపిలో వైసీపీ కీలక నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బాలినేని గైర్హాజరయ్యారు. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో జగన్ క్లారిటీ  ఇవ్వకపోవడంతోనే ఇలా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అసహనంగానే ఉన్నారు. . ఆయన కూడా ఈ మీటింగ్ కు దూరంగా ఉన్నారట.

Latest Videos

జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సులో అగ్నిప్రమాదం, వృద్ధురాలు సజీవ దహనం..

మాగుంట కుటుంబానికి ఎంపీ సీటు విషయంలో టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు.. ఈసారి వైసీపీ నుంచి ఒంగోలు స్థానం మాగుంటకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. బాలినేని కూడా ఎంపీ టికెట్ ను మాగుంట కుటుంబానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతోనే ఇద్దరు నేతలు మీటింగుకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

ఒంగోలు ఎంపీ స్థానంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డికి బదులు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  వైసీపీ వర్గాల్లో ఈ మేరకు చర్చ జరుగుతుండడంతో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలని మాగుంట అనుకుంటున్నారట. కొండేపిలో జరుగుతున్న సమావేశానికి దూరంగా బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని ఏఎంబి మాల్ లో ఉండగా,  మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఒంగోలులోనే ఉన్నారు. 

వైసీపీలో అంతా తానై నడిపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ మొదటి లిస్టు విడుదలైనప్పటి నుంచి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ లిస్టు విడుదలైన తర్వాత తన మాట అధిష్టానం పట్టించుకోవడం లేదన్న విషయంలో అసహనంగా ఉన్నారట. థార్డ్ లిస్ట్ లో మార్కాపురం ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరు కూడా లేకపోవడంతో బాలినేని అలిగారని వినిపిస్తోంది. 

దీంతో బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోందట అధిష్టానం. బాలినేని, మాగుంటల వ్యవహారంతో ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి నెలకొంది. ఇక ఈ రోజు కొండేపిలో జరిగిన వైసీపీ నూతన నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పరిచయ కార్యక్రమానికి వీరిద్దరితో పాటు.. ఒంగోలు మాజీ ఇంఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా దూరంగా ఉన్నారట. 

తనమాటకు విలువలేదని అలిగిన బాలినేని.. అందుకే పార్టీ సమావేశాలకు కూడా తనకేం సంబంధం లేదన్నట్టుగా హైదరాబాద్ కు వచ్చి ఏఎంబి మాల్ లో.. గుంటూరు కారం సినిమా చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలు టికెట్ దక్కుతుందని అంటున్నారు. బాలినేని పార్టీ వదులుకోదని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉందని చెబుతున్నారు. సంక్రాంతి తరువాత వైసిపి నాలుగో జాబితా విడుదల కానుంది. ఈ జాబితాలో బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఉంటుందా లేదా వేచి చూడాల్సిందే. 

click me!