చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది... ఎమ్మెల్యే ఆళ్ల

By telugu teamFirst Published Aug 14, 2019, 12:14 PM IST
Highlights

అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు.

మాజీ సీఎం చంద్రబాబు తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన 
ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో  ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. 

అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు.కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని పేర్కొన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

related news

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

click me!