తండ్రి వెనుకే అడవిలోకి వెళ్లి తప్పిపోయిన మూడేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారం రోజులుగా బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.
నెల్లూరు: తండ్రి వెనుకే అడవిలోకి వెళ్లి తప్పిపోయిన మూడేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారం రోజులుగా బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి అడవుల్లో మూడేళ్ల బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉయ్యాలపల్లి మండలంలోని అరుంధతివాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. బుజ్జయ్య గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుజ్జయ్య భార్య వరలక్ష్మి కూలీ పనులు చేసేది.
ఈ నెల 1వ తేదీన బుజ్జయ్య గొర్రెలను మేపేందుకుతమ గ్రామానికి సమీపంలోని వెలుగొండ అడవిలోకి వెళ్లాడు. ప్రతి రోజూ మాదిరిగానే తండ్రి వెంట అతని కొడుకు సంజూ కొంతదూరం వెళ్లి ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడు. అయితే జూలై 1వ తేదీన తండ్రి వెంట మూడేళ్ల కొడుకు వెళ్లాడు. ఆ తర్వాత సంజూ తిరిగి రాలేదు. తన కొడుకు తిరిగి రాకపోవడంతో తల్లి గ్రామంలో వెతికింది. అయితే తండ్రి వెంట అడవిలోకి వెళ్లినట్టుగా స్థానికులు చెప్పారు. దీంతో పేరేంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం రోజులుగా పోలీసులు ఈ అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.