అంతర్వేది రథం దగ్ధం... రోడ్డు ప్రమాదంలో అనుమానితుడు మృతి

By Arun Kumar PFirst Published Jul 6, 2021, 12:47 PM IST
Highlights

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం ఘటనలో అనుమానితుడు యాకోబు అలీ(50) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ హిందూ దేవాలయం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం ఘటనలో అనుమానితుడు యాకోబు అలీ(50) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సఖినేటిపల్లి ప్రధాన రహదారి కూడలిలో రోడ్డుపక్కన పడుకొన్న యాకోబుపై నుండి ఓ మినీ వ్యాన్ వెళ్ళింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి.చెందాడు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాకోబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన కూడలిలోని సీసీ పుట్టేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

read more  అంతర్వేదిలో సిద్దమైన నూతన రథం: ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఆలయంలో స్వామివారి ఊరేగింపు రధం అగ్నిప్రమాదానికి గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై హిదూ సంఘాలే కాదు బిజెపి, టిడిపి, జనసేన వంటి రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు చేపట్టాయి. దీంతో వైసిపి సర్కార్ ఇరకాటంలో పడింది.  

ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం అర్ధరాత్రి మంటల్లో పూర్తిగా కాలిపోవడానికి మతిస్థిమితం లేని యాకోబు అలీ కారణమని నిర్దారించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత వదిలిపెట్టారు.  తాజాగా అతడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 

click me!