దారుణం : మైనర్ల ప్రేమ వివాహం.. అంతలోనే దారుణహత్య..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 31, 2020, 10:11 AM IST
దారుణం : మైనర్ల ప్రేమ వివాహం.. అంతలోనే దారుణహత్య..

సారాంశం

మూడునెలల క్రితం వివాహమైన మైనర్ బాలిక హత్యకు గురైన దారుణ సంఘటన  తాడేపల్లి రూరల్‌, మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో జరిగింది. బాలికను దారుణంగా ముఖం కోసి, కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. వివరాల్లోకి వెడితే..

మూడునెలల క్రితం వివాహమైన మైనర్ బాలిక హత్యకు గురైన దారుణ సంఘటన 
తాడేపల్లి రూరల్‌, మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో జరిగింది. బాలికను దారుణంగా ముఖం కోసి, కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. వివరాల్లోకి వెడితే..

యర్రబాలెం గ్రామం టేకుతోట సమీపంలో నివాసం ఉండే గురవయ్య, విజయలక్ష్మిల పెద్ద కుమార్తెకు, ఇంటి పక్కనే నివాసం ఉండే వీరయ్య, ఈశ్వరమ్మల కుమారుడికి మూడు నెలల క్రితం వివాహం చేశారు. మైనర్లిద్దరూ ప్రేమించుకోవటంతో అబ్బాయి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకున్నారు. కట్నంగా రెండున్నర లక్షల రూపాయలు అడిగారు.

అయితే అప్పుడు లేవని ఐదు నెలల తర్వాత ఇస్తామని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో పెళ్లైన తరువాత అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. కొంతకాలంగా అత్తామామలు, భర్త కట్నం తీసుకురావాలని బాలికను వేధిస్తున్నారు. 

ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున వారు నివాసం ఉండే ఇంటికి 500 మీటర్ల దూరంలో చెట్ల పొదల్లో బాలిక మృతి చెంది కనిపించింది. బహిర్భూమికి వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటనా స్థలానికి వచ్చిన సీఐ శేషగిరిరావు డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించారు. 

జాగిలాలు భర్త దగ్గరకు వెళ్లి ఆగాయి. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన సంఘటనపై సీఐ శేషగిరిరావును వివరణ కోరగా జరిగింది హత్యేనని నిర్ధారించారు. బాలిక మొహాన్ని కోసి, విచక్షణా రహితంగా పొత్తి కడుపు కింద భాగంలో కత్తితో పొడిచారన్నారు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!